ప్రణయ్ హత్యలో నయీం గ్యాంగ్ !

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ని హతమార్చేందుకు అతని భార్య అమృత తండ్రి మారుతీ రావు నయీం ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, ప్రణయ్ హత్యకు కోటి రూపాయల సుపారీ ఇచ్చాడని తెలుస్తోంది. ఇంతేగాక.. మిర్యాలగూడలో నయీం అనుచరులతో కలిసి గతంలో పలు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని తెలిసింది. భూకబ్జాలలో ఆరితేరాడని, ఒక సందర్భంలో కిడ్నాప్ కు గురి కాగా.. ఆ తరువాత తనను కిడ్నాప్ చేసిన గ్యాంగ్ తోనే కుమ్మక్కయ్యాడని అంటున్నారు. కాగా- ప్రణయ్ హత్య కేసు నేపథ్యంలో మిర్యాలగూడ  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అల్లుడిని హత్య చేయాలని మారుతీ రావు నిర్ణయించుకున్న తరువాత, మిగతా వ్యవహారమంతా కరీం చొరవ తీసుకుని నడిపించాడని తెలిసింది. సుపారీ మాట్లాడడం, హంతకుల ఏర్పాటు వరకు ఇతని పర్యవేక్షణలోనే జరిగినట్టు చెబుతున్నారు.

Related News