నయన‌తార ‘వన్ మేన్ షో’

నయనతార లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ ‘కొలమావు కోకిల’కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 17న థియేటర్స్‌కి వచ్చిన ఈ చిత్రం అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం మూడురోజుల్లోనే రూ. 11.20 కోట్లు వసూలు చేయడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ! ఆదివారం ఒక్కరోజే తమిళనాడులో నాలుగు కోట్లుపైగానే వసూళ్లురాబట్టడం విశేషం.

స్టోరీలోకి వెళ్తే.. కేన్సర్‌తో బాధపడుతోన్న తన తల్లికి ట్రీట్‌మెంట్ కోసం డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపే పాత్రను పోషించింది నయనతార. డ్రగ్స్‌ను సప్లయ్ చేసే రోల్‌లో నయన నటన అదుర్స్ అనే టాక్ నడుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే నయన వన్ మేన్ షో అన్నమాట. కథ,కధనం పరంగా హీరో పాత్ర లేకపోయినప్పటికీ అన్నీ తానే అయి సినిమాని సక్సెస్ బాట పట్టించింది నయన్. తమిళంలో హిట్ కావడంతో టాలీవుడ్‌లోనూ ‘కోకో కోకిల’ పేరుతో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

Related News