అలూవాలో మరో ‘హీరోచిత’ రెస్క్యూ

కేరళలోని అలూవాలో ఓ గర్భిణిని హెలికాప్టర్ ద్వారా ఇటీవల రక్షించారు నేవీ సిబ్బంది. తాజాగా అదే అలూవాలో..ఛాతీ వరకు దేహభాగం చచ్చుపడిపోయి..వీల్ చైర్ కే అంకితమైన మరో గర్భిణిని కాపాడారు. కెప్టెన్ పి.రాజ్ కుమార్ నేతృత్వంలో ఈ ఛాలెంజింగ్ రెస్క్యూ నిర్వహించారు. ఈ వీడియోను నేవీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. అతి కష్టమైన ఈ ప్రయత్నంలో విజయం సాధించగలిగామని పేర్కొంది. అటు..వరద పరిస్థితి కొంతవరకు తగ్గుముఖం పట్టడంతో కేరళలో ఏటీఎం సర్వీసులను పునరుద్ధరించారు. కేరళ బస్సు సర్వీసులు ప్రారంభ మయ్యాయని వార్తలు వస్తున్నాయి. అలాగే పాక్షికంగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించారు. కొచ్చిలోని నావికా స్థావరాన్ని విమానాలు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. సోమవారం తొలి కమర్షియల్ ప్లేన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. అటు-కొన్ని చోట్ల రైలు సర్వీసులను కూడా తిరిగి ప్రారంభించారు.

Related News