వీడియో.. చంద్రుడి లోగుట్టు బయటపెట్టిన నాసా

చంద్రుడికి సంబంధించిన ఓ వీడియో విడుదల చేసింది నాసా. చంద్రుడిపైవున్న లోయలు, దక్షిణ ధృవం, పీఠభూముల గురించి అధ్యయనం అందులో కళ్లకు కట్టినట్టు చూపించింది. 2009 నుంచి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా లూనార్ ఆర్బిటర్ వీడియోను.. 4కే రెజల్యూషన్‌లో చూపించడం కొసమెరుపు.

చంద్రుడిపై ఈ ఆర్బిటర్ సేకరించిన డేటాను అందులో పొందుపరిచారు. చంద్రుడి పశ్చిమ సరిహద్దు నుంచి మొదలై.. 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో, 13 కిలోమీటర్ల లోతు వరకు ఈ ఆర్బిటర్ చంద్రుడి సమాచారాన్ని సేకరించింది. ఇందులో అపోలో 17 లూనార్ ల్యాండర్ వదిలేసి రోవర్ వెహికిల్ కూడా కనిపిస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే చంద్రుడ్ని అతి దగ్గరి నుంచి చూస్తున్న అనుభూతి కలిగేలా దీన్ని రూపొందించింది. మరి ఆ అద్భుత వీడియోపై ఓ లుక్కేద్దాం..

Related News