ఏదీ.. భూకంపం రాలేదే: మోదీ

అవిశ్వాసంపై చర్చ చేపడితే భూకంపం వస్తుందన్నారే… ఏదీ భూకంపం? అంటూ విపక్షాల్ని ప్రశ్నించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సంపూర్ణ అధిక్యంతో వచ్చిన ప్రభుత్వం తమదని.. 2019లో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని అంటున్నారు.. ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగ్య విధాతలన్నారు. అవిశ్వాస తీర్మానం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించిన గొప్ప అవకాశమన్న ఆయన, తమపై విశ్వాసం పెంచేందుకు ఉపయోగపడే సందర్భం ఇదని తిప్పికొట్టారు.

లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు తెచ్చారనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోందన్నారు. అహంకార పూరిత ధోరణితో, ప్రధాని కుర్చీలో ఎప్పుడు కూర్చుందామనేది వారి ఆరాటమని పరోక్షంగా రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ నేతలు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.

Related News