రూ.2 వేల నోట్లు రద్దు చేయండి

పెద్ద నోట్ల రద్దుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రూ.2 వేల నోట్ల వల్ల అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెయ్యి, ఐదువందల నోట్ల రద్దు తర్వాత కేంద్రం తీసుకొచ్చిన రూ.2 వేల నోటును రద్దు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. దేశంలో రూ. 500కు మించి పెద్ద నోటు ఉండకూడదన్నది తమ విధానమని లోకేష్ చెప్పారు. ఏపీ సచివాలయంలో ఐసీఐసీఐ బ్యాంకు శాఖను ప్రారంభించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Related News