నేనున్నాను.. తారక్‌కి చంద్రబాబు అభయం!

దివంగత నందమూరి హరికృష్ణ పెద్దకర్మ శనివారం హైదరాబాద్‌ జలవిహార్‌లో నిర్వహించారు. దీనికి నందమూరి కుటుంబసభ్యులతోపాటు రాజకీయ, సినీరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కల్యాణ్‌రామ్, తారక్‌లను దగ్గరకు పిలిపించుకుని చేతిలో చేయి వేసుకుని మాట్లాడారు సీఎం చంద్రబాబు.

తానున్నానంటూ భరోసా ఇచ్చినట్టు కనిపించింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, లోకేష్, పురందేశ్వరి, నాగార్జున, మురళీమోహన్, రామ్మోహన్ నాయుడులతోపాటు మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై హరికృష్ణ చిత్ర పటానికి నివాళి అర్పించారు.

Related News