రాజకీయాల్లోకి వచ్చింది అందుకే

రాజకీయాలపై పూర్తిస్థాయిలో నోరు విప్పారు నటుడు, పొలిటికల్ లీడర్ కమల్‌హాసన్. ఇప్పుడు రాజకీయ నేతగా లైఫ్‌ని హ్యాపీగా గడుపుతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో తన పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నానని, తమ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం’కి కొన్ని లక్ష్యాలున్నాయని, వాటి కోసం సాధన చేస్తున్నానని వెల్లడించారు. ఓ కామెంట్‌ చేసినందుకు తనకు రాజకీయ నాయకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, చివరకు తన ఆస్తుల్ని దాదాపు సీజ్‌ చేసేశారు.. ఇది తనకు గుణపాఠం నేర్పిందన్నారు.

 

రాజకీయాలు మంచివి కావని తన ఫ్రెండ్స్ చెప్పారని, కానీ, వాళ్లంతా రాజకీయ నాయకులేనన్నారు. తాను ఇక్కడ పీఆర్‌ ఉద్యోగం చేయడం లేదని, తమిళనాడు ప్రజల కోసం మాట్లాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని కుండబద్దలు కొట్టేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాలను తెలియజేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

 

Related News