రంజాన్ నెల వచ్చిందంటే.. ఈ గుడికి రాళ్ల దెబ్బలే!

నెదర్లాండ్స్.. ఇక్కడి జనాభాలో ముస్లిం వాటా 4 శాతం. మత ప్రాతిపదికన లెక్కేస్తే రెండవ అతిపెద్ద గ్రూప్ కూడా ఇదే. మొత్తం కోటీ 70 లక్షలుండే నెదర్లాండ్స్ జనాభాలో హిందువులు కూడా దాదాపు 2 లక్షల 15 వేల మంది వుంటారు. పశ్చిమ నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో హిందువుల ఉనికి చెప్పుకోదగ్గ రీతిలో ఉంటుంది. అందుకే.. మరో మైనారిటీ వర్గమైన ముస్లిమ్స్‌తో తరచూ స్వల్ప స్థాయిలో ఘర్షణ వాతావరణం తప్పదు. రంజాన్ నెల వచ్చిందంటే హిందువుల్లో ఎంతోకొంత ఆందోళన నెలకొనడం కామన్. హేగ్‌లోని సిల్డర్స్ విక్ ప్రాంతంలో ఒక హిందూ దేవాలయానికైతే దాడుల బెడద సహజం.

ఈసారి కూడా ఈ టెంపుల్‌లోని ఒక ప్రేయర్ హౌస్ టార్గెట్‌గా రాళ్ళతో ఎటాక్ చేశారు ముస్లిం కుర్రాళ్ళు. వెనుకవైపుండే ఒక ప్లే‌గ్రౌండ్ నుంచి ఈ దాడి జరుగుతోందని.. వీళ్ల నుంచి జాగ్రత్తపడ్డం కోసమే అటువైపు గోడను రెండుమూడు లేయర్లతో పటిష్టంగా కట్టుకున్నామని.. టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ చెబుతున్నారు. స్థానిక పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.

READ ALSO

Related News