నా‌పై హత్యా‌యత్నం..సుమన్

తనపై హత్యా యత్నం జరిగిందని చెన్నూరు తెరాస అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని, ఎవరి సీటునూ  తాను కావాలని తీసుకోలేదని చెప్పారు. చెన్నూరు సీటును ఆశించిన నల్లాల  ఓదెలు మద్దతుదారులు తనపై పెట్రోలు పోసి అగ్గిపుల్ల వేసేందుకు ప్రయత్నించారని,  అయితే తన గన్‌మన్‌తో బాటు కొందరు స్నేహితులు తనను రక్షించారని సుమన్ తెలిపారు. ఎవరు, ఎన్ని కుట్రలు చేసినా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉదయం  మంచిర్యాల జిల్లా ఇందారంలో ప్రచారం చేస్తున్న బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా ఓదెలు మద్దతుదారులు నినాదాలు చేయడం, ఓదెలు సహచరుడైన గట్టయ్య అనే వ్యక్తి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం  చేయగా..ఈ ఘటనలో ఓ ఛానల్ కెమెరా‌మన్ సహా ముగ్గురు మంటల్లో గాయపడిన సంగతి తెలిసిందే.

Related News