ట్రంప్ సర్కార్ నిర్ణయం, లైవ్‌లో యాంకర్ కన్నీరు

ఓ వార్త చదువుతూ న్యూస్‌ రీడర్‌ కంటతడి పెట్టారు. ఈ వ్యవహారం అమెరికాకు చెందిన ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టీవీ ఛానెల్‌లో వెలుగుచూసింది. ఇంతకీ యాంకర్ కన్నీరు వెనుక అసలు కథేంటి? మెక్సికో సరిహద్దుల ద్వారా అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తని న్యూస్‌ రీడర్‌ రాచెల్‌ చదువుతూ.. అక్రమ వలసదారుల సంతానాన్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి, వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచుతున్నారంటూ కన్నీరు ఆపుకోలేకపోయింది. వార్తని చదవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె వల్ల కాలేదు. చివరకు సారీ చెప్పేసి ఆ ఐటెమ్‌ని ఆపేశారు.

 

Related News