నన్నే హెచ్చరించేంత మగాడివా? కించపరిస్తే నాలుక కోస్తా

తాడిపత్రి ఘర్షణ సమయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న ఎంపీ జేసీ విమర్శలపై  కదిరి సీఐ గోరంట్ల మాధవ్ మండిపడి..మీసాలు తిప్పిన వైనంపై జేసీ తీవ్రంగా కౌంటరిచ్చారు. ‘ నా చుట్టూ తిరిగేవాడివి.. నన్నే హెచ్చరించేంత మగాడివా ? కించపరిస్తే నాలుక కోస్తా ” అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ నీ సంగతి తేలుస్తా.. ఎక్కడికి రావాలో చెప్పు.’అని సవాల్ విసిరారు.. దమ్ముంటే తన నాలుక కోయాలని, నా పైనే మీసాలు తిప్పుతావా ‘ అని ఫైర్ అయ్యారు. నువ్వు ఉద్యోగం వదిలి రా. నేను రాజకీయాలు వదిలి వస్తా. తేల్చుకుందాం అన్నారు. తాను ఏ ఒక్కరినీ ఉద్దేశించి హిజ్రా అన్న పదం వాడలేదని, ఈ పదం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, ఎవరైనా బాధ పడితే క్షమాపణ చెబుతున్నానని జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పాదాభివందనం చేస్తానని పేర్కొన్నారు.

Related News