మకాం మార్చిన మోత్కుపల్లి!


చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతియ్యడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైసీపీ ‘వ్యూహం’ సిద్ధం చేసింది. బాబు వ్యక్తిత్వ హననం కోసం పటిష్టమైన టీమ్‌ని కూడా ఏర్పాటు చేసి.. ఒక పధ్ధతి ప్రకారం ఒక్కొక్కరినీ రంగంలో దింపుతూ ముందుకెళ్తున్నట్లు వైసీపీ కదలికలు చెబుతున్నాయి. ఇప్పటికే బాబు వ్యతిరేకులందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి.. వైసీపీ థియరీకి తగ్గట్లు వాళ్ళతో ట్యూన్లు కట్టిస్తోంది. ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి.. ఇలా ఒక్కరొక్కరుగా బైటికొచ్చి వారివారి స్థాయిల్లో సౌండ్ పెంచుతున్నారు. వైసీపీ ‘టాస్క్ ఫోర్స్’లో కొత్త చేరిక మోత్కుపల్లి నరసింహులు. తెలంగాణ టీడీపీ నుంచి ఇటీవలే బహిష్కరణకు గురైన మోత్కుపల్లిని ఇంటికెళ్లిమరీ ‘పరామర్శించి’ వచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. శత్రువు శత్రువు మనకు మిత్రుడవడం అనేది సాధారణ విషయం. బుధవారం ఆలేరులో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి చంద్రబాబు మీద తిట్ల దండకం అందుకున్నారు.

 

  • ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.
  • చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ.
  • ఏపీని చంద్రబాబు అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు!
  • ‘బాబు టీడీపీ ద్రోహి’.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు.
  • మోకాళ్ళ నొప్పులున్నా.. బాబు ఓటమి కోసం తిరుపతి మెట్లెక్కుతా..!

తెలంగాణలో కేసీఆర్‌ని తిడితే వచ్చేంత మైలేజ్.. చంద్రబాబును తిడితే రాదు కనుక.. మోత్కుపల్లి మకాం మార్చెయ్యబోతున్నట్లు వినికిడి. ఇకనుంచి ఏపీలో ఎక్కువకాలం ఉంటూ.. చంద్రబాబు టార్గెట్‌గా వెర్బల్ పాలిటిక్స్ షురూ చేయాలని ఆయన భావిస్తున్నారట. వైసీపీలో చేరకపోయినా.. వైసీపీ సానుభూతిపరుడిగా కొనసాగేలా మోత్కుపల్లి ఒక డీల్ కుదుర్చుకున్నట్లు టీడీపీ వర్గాలు పసిగట్టేశాయి. ఇదంతా ప్రశాంత్ కిషోర్ జగన్‌కి గీసిచ్చిన స్కెచ్చులో భాగమేనని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపోమాపో తిరుపతికి వెళ్లనున్న మోత్కుపల్లి.. బాబు మీద పేల్చడానికి మరిన్ని తూటాలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో రివర్స్ ఎటాక్ కోసం ఏపీ టీడీపీ మరింత అప్రమత్తమైంది.

Related News