రెండు తెలుగు రాష్ట్రాలకూ మళ్ళీ షాకిచ్చిన మోదీ !

ఇప్పటికే విభజన హామీల విషయంలో బొక్కబోర్లా పడ్డ కేంద్ర సర్కార్.. ఏపీ సర్కారుకు మరో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేసింది. కడపలో ఏర్పాటవుంటుందనుకున్న ఉక్కు ఫ్యాక్టరీ మీద నీళ్లు జల్లేసింది మోదీ సర్కార్. కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని పేర్కొంటూ.. ఈ మేరకు సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయని, ఖనిజం దొరక్క కష్టాలు పడుతున్నాయని.. ఇప్పుడు కొత్తగా ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయడమంటే.. అది దుస్సాహసమే అవుతుందని.. మెకాన్ సంస్థ ఇచ్చిన నివేదికను తమ వాదనకు ఆధారంగా పేర్కొంది. కేవలం సాధ్యాసాధ్యాలు పరిశీలించమని మాత్రమే విభజన చట్టంలో ఉందన్న కేంద్రం.. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చిన క్రమంలో ఆ దిశగా ప్రయత్నించినట్లు చెబుతోంది. కడపతో పాటు ఖమ్మం జిల్లా బయ్యారంలో కూడా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ.. ఆ రెండూ అసాధ్యమన్న క్లారిటీకి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఆరునెలల్లోనే వచ్చేశామంటోంది. ఇప్పుడు మెకాన్ రిపోర్ట్‌ని బూచిగా చూపెట్టి తుది నిర్ణయం ప్రకటించి.. పూర్తిగా చేతులెత్తేసింది మోదీ దివాణం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకూ కేంద్ర సర్కారు మరోసారి టార్గెట్ అయ్యింది.

 

READ ALSO

Related News