మీటూపై సంచలన వ్యాఖ్యలు

మహిళల లైంగిక వేధింపులపై మీటూ వేదికగా సాగుతున్న ఉద్యమంపై నోరు విప్పారు మహారాష్ట్ర నవనిర్మాణసేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే. మీటూ ఉద్యమం చాలా తీవ్రమైందని, దీని గురించి సోషల్‌మీడియాలో చర్చించడం సరైందన్నారు. మహిళలు ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే బాధితులు తమ పార్టీని సంప్రదించవచ్చని, పదేళ్ల తర్వాత కాకుండా వెంటనే స్పందించాలని సూచించారు ఠాక్రే.

మరోవైపు నటుడు నానాపటేకర్ అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కావచ్చని, ఆయన గురించి నాకు తెలుసు, కానీ ఇలా చేశాడని అనుకోవడం లేదని మనసులోని మాట బయపెట్టారు. దీనిపై కోర్టు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశంలో పెరుగుతున్న పెట్రోలు ధరలు, రూపాయి పతనం, పెరుగుతున్న నిరుద్యోగం గురించి ప్రజలను మళ్లించేందుకే మీటూ పేరిట ఉద్యమం చేపట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News