లోకేష్ తమ్ముడు ఎటువైపు!

ఎన్టీఆర్ ఫ్యామిలీ మూడోతరం నుంచి మరో యువకుడి పొలిటికల్ అరంగేట్రంకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే చంద్రబాబు కొడుకు లోకేష్ కేబినెట్ మంత్రిగా వుండగా, హరికృష్ణ కొడుకు తారక్ టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు. వీళ్లకు ధీటుగా హితేష్ చెంచురామ్ రాజకీయాల్లోకి రానున్నాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పురందేశ్వరిల వారసుడు ఇతడు. అమెరికాలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో పట్టాపుచ్చుకున్న హితేష్, నెక్ట్స్ ఏంటి అంటూ పేరెంట్స్ దగ్గర క్లారిటీ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నాన్న సొంత నియోజకవర్గం పర్చూరు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించడానికి బేస్ రెడీ అవుతోందన్నది స్థానిక వార్త.

దగ్గుబాటి వెంకటేశ్వరరావుని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిన పర్చూరు ఓటర్లు ఇప్పుడు ఆయన వారసుడికి బాసటగా వుంటారని దగ్గుపాటి ఫ్యామిలీ భావిస్తోంది. కానీ, ఏ పార్టీ నుంచి బరిలోకి దించాలన్న సంశయం నుంచి బయట పడలేకపోతోంది. తల్లి బీజేపీలో వుండగా, తండ్రి ‘ఖాళీ’గా వున్నారు. మరి కొడుకు ఎటువైపు మళ్లుతాడన్న సస్పెన్స్ పర్చూరులో కూడా నెలకొంది. బీజేపీకి విన్నింగ్ ఛాన్స్ తక్కువగా వున్నందున హితేష్, ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నట్లు సమాచారం. కజిన్ బ్రదర్ లోకేష్‌తో హితేష్‌కి మంచి చనువుంది. ఈ చనువు రాజకీయపరంగా ఉపయోగపడుతుందా? అన్న దిశగా కూడా ఆలోచన సాగుతోంది. కొంతకాలం ఆగితే తప్ప క్లారిటీ రాదు.

Related News