సీఎం సీటుపై కన్నేసిన అక్బర్

తెలంగాణ అసెంబ్లీని కూడా ‘హంగ్’ బెడద పట్టుకుంటుందా? దూకుడు మీదున్న అధికార పార్టీ తెరాస, మహాకూటమి కోసం స్కెచ్చులు వేస్తున్న కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ తప్పదా? ఇరు పక్షాల్లో ఎవ్వరికీ మేజిక్ ఫిగర్ దక్కే అవకాశాలు లేనట్లేనా? ఈ ప్రశ్నలన్నీ కొందరికి కొత్తగా, మరికొందరికి కఠినంగా ఉండవచ్చు. కానీ.. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాత్రం ఈ విషయంలో పిచ్చ క్లారిటీతో వున్నారు.

”నవంబర్లో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. మనమూ కష్టపడదాం.. మనమూ గెలుద్దాం” అంటూ కొత్త నినాదం ఇస్తున్నారు అక్బర్. ”కర్ణాటకలో కుమారస్వామి సీఎం అవగా లేనిది మనం కాలేమా..? చూద్దాం ఎవ్వరికి ఎవ్వరితో అవసరం పడుతుందో..” అంటూ సరికొత్త సందేహాల్ని బైటపెట్టారాయన. హైదరాబాద్ మల్లేపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర లేపింది.

Related News