ఆ హీరోకి చాలా సిగ్గు.. లిప్‌లాక్‌కి 19 సార్లు ట్రై చేసి,

రెండేళ్ల కిందట వచ్చిన ‘మెట్రో’ మూవీతో తనకంటూ నటుడు శిరీష్ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘రాజా రంగుస్కి’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేపథ్యంలో రానున్న ఈ ప్రాజెక్టులో పోలీసు అధికారిగా కనిపించనున్నాడు శిరీష్. ఐతే, సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో గురించి ఓ కొత్త విషయాన్ని రివీల్ చేసింది హీరోయిన్ చాందిని.

ఇందులోని హీరోతో అన్ని సన్నివేశాలు దాదాపు సింగిల్ టేక్‌లో పూర్తి చేశామని.. కానీ, ఓ సీన్‌కి మాత్రం 19 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. తనతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరో అన్ని టేకులు తీసుకున్నాడని వెల్లడించింది. తానైతే ఫస్ట్ టేక్‌లోనే పర్ఫెక్ట్‌గా చేశానని, ఈ విషయంలో హీరోకి సిగ్గు ఎక్కువని అంటోంది. అందుకే ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బందిపడినట్టు వెల్లడించింది. మొత్తానికి చాందిని మాటలతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

Related News