మెగా ‘సమ్‌థింగ్ స్పెషల్’

మెగాస్టార్ చిరంజీవి.. అజర్‌బైజాన్ సంగతులేంటి? అక్కడే వున్నారా లేదా జార్జియాకి వెళ్లారా? ఇదే ప్రశ్న చాలామంది అభిమానులను వెంటాడుతోంది. సైరా కోసం జార్జియాకి వెళ్తూ.. రామ్‌చరణ్ సెట్స్‌కి వెళ్లారు చిరంజీవి. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ అజర్‌బైజాన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బుధవారం నిర్మాతతో కలిసి చిరు పిక్ బయటకు రాగా, గురువారం మరొకటి వచ్చింది.

ఈసారి చిరంజీవి, ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్‌, సుస్మిత అంతా బ్లాక్ డ్రెస్ ధరించి డిన్నర్‌కి వెళ్ళారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో మెగా ఫ్యామిలీని చూసిన ఫ్యాన్స్, సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇంతవరకు బాగానేవున్నా.. బ్లాక్‌ డ్రెస్ వెనుక సీక్రెట్ ఏంటి? మెగా ఫ్యామిలీలో ఏమైనా విశేషం వుందా? ఎప్పుడూ ఈ విధంగా కనిపించలేదని, దీనివెనుక ‘సమ్‌థింగ్’ వుందని అనుకుంటున్నారు. మొత్తానికి రోజుకో పిక్‌తో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తోంది మెగా ఫ్యామిలీ.

View this post on Instagram

#lovehasnoboundaries ❤️ stay in sync #ramcharan

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

Related News