చిన్నల్లుడుగారి మెగా సస్పెన్స్

మెగా ఫ్యామిలీ నుంచి ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా తెరమీదికొచ్చిన కళ్యాణ్ దేవ్.. అంతే స్పీడ్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి సినిమాలోనే పూర్తి యూత్‌ఫుల్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. వారాహి చలనచిత్ర బేనర్‌పై సాయికొర్రపాటి నిర్మాణ పర్యవేక్షణలో వస్తున్న ‘విజేత’.. కళ్యాణ్‌దేవ్‌కి డెబ్యూ మూవీ. రాకేష్ సాహి డైరెక్ట్ చేస్తున్న ‘విజేత’ ఫస్ట్‌లుక్ రిలీజయింది. సెంట్‌పర్సెంట్ సింప్లిసిటీతో కూడిన ఈ లుక్ ద్వారా.. సినిమా కంటెంట్‌ని కూడా రివీల్ చేసినట్లయింది. ఫక్తు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ‘విజేత’ మూవీలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతగా ఉంటుందని చెబుతున్నారు. మెగా అల్లుడి పెర్ఫామెన్స్ చిరూ ఫ్యామిలీ ప్రతిష్టను ఇనుమడించేలా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే టీజర్, ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సిందే!

Related News