15 ఏళ్లకు ఒకసారి.. భూమి దగ్గరగా మార్స్

విశ్వంలో వింతలకు కొదవలేదు. ఈసారి 15 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వస్తోంది అరుణ గ్రహం. వచ్చేనెల 27న ఈ అరుదైన వింత కనిపించనున్నట్టు నాసా ప్రకటన. సూర్యుడికి ఎదురుగా రావడంవల్ల ఆ కాంతి మార్స్‌పైపడి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతోంది. జూపిటర్, వీనస్ వంటి గ్రహాల కన్నా ప్రకాశవంతంగా కనిపిస్తుందని శాస్ర్తవేత్తలు అంటున్నారు. రానున్న నెలల్లో ప్రతీరోజూ రాత్రి ఈ గ్రహాన్ని చూడవచ్చు. సూర్యుడు- మార్స్ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండటాన్ని ‘మార్స్ అపోజిషన్‌’ అంటారు.

ప్రతీ 15 – 17 ఏళ్లకు ఈ అపోజిషన్ ఏర్పడుతుందన్నది నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ సమయంలో సూర్యుడికి దగ్గరగా రావడమేకాదు, మార్స్ కక్ష్యలో అపోజిషన్ ఎప్పుడైనా ఏర్పడుతుంది. ఐతే, అది సూర్యుడికి దగ్గరున్న సమయంలో ఏర్పడినపుడు అరుణ గ్రహం భూమికి అతి చేరువగా వస్తుందని నాసా చెబుతోంది. సుమారు 60 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చిన మార్స్, చివరిసారి 2003లో భూమికి అతి చేరువగా
వచ్చింది.

Related News