ఎంఐఎం తొలి జాబితా విడుదల

హైదరాబాద్ పాత బస్తీలో తన పట్టు నిలుపుకునేందుకు ఎంఐఎం సిద్ధమైంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. చాంద్రాయణగుట్ట  నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్ పురలో అహ్మద్ పాషా ఖాద్రి పార్టీ టికెట్ పై పోటీ చేయనున్నారు. వీరితో బాటు ముంతాజ్ అహ్మద్ ఖాన్ (చార్మినార్), మహ్మద్ మౌజం ఖాన్ (బహదూర్ పుర), అహ్మద్ బిన్ బలాల (మలక్ పేట), జాఫర్ హుసేన్ మీర్జా (నాంపల్లి), కౌసర్ మొహినుద్దీన్ (కార్వాన్) లకు పార్టీ టికెట్లు లభించాయి. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్టీ తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎంఐఎం కు ఈసీ కైట్ (గాలిపటం) గుర్తును కేటాయించింది.

Related News