సెకండ్ ఎప్పుడు.. ఎక్కడ?

మహేష్‌బాబు- పూజాహెగ్డే జంటగా ఓ ఫిల్మ్ రానుంది. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ కావడంతో యూనిట్ హైదరాబాద్‌కి చేరింది. 24 రోజులపాటు జరిగిన ఈ షెడ్యూల్, ఊహించిన దానికంటే బాగా రావడంతో సభ్యులంతా ఫుల్‌ఖుషీ! దీనికి హీరోయిన్ పూజా కూడా హాజరయ్యింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ప్రిన్స్ తొలిసారి చేస్తున్న సినిమా ఇది! అంతేకాదు హీరోకి ఇదొక 25వ మైల్‌స్టోన్ ఫిల్మ్!

కొద్దిరోజుల గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్‌కి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా స్టూడెంట్ గెటప్‌లోవున్న మహేష్‌బాబుని లుక్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. గెడ్డం, డిఫెరెంట్ హెయిర్ స్టైల్‌తో వెరైటీగా కనిపించడంతో తమ అభిమాన హీరో సిక్స్‌ప్యాక్‌లో దర్శనమీయడం ఖాయమని చర్చించుకుంటున్నారు. అంతా అనుకున్నట్లు‌గా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలన్నది నిర్మాత థాట్.

READ ALSO

Related News