హిందీలో ‘స్పైడర్’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఎన్నో అంచనాలతో వచ్చింది ‘స్పైడర్’ సినిమా. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్లాప్ టాక్ తెచ్చుకుని మహేష్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని తెలుగు.. తమిళ భాషల్లో నిర్మించి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు మురుగదాస్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీ రీమేక్ లోను హీరోగా మహేశ్ బాబు పేరు వినిపిస్తూ ఉండటం విశేషం. అప్పట్లోనే హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ రీమేక్ ఆలోచనతోనే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు.

Related News