పచ్చి పాలతో స్నానం చేసి..

కడుపు మండిన రైతన్న రోడ్డెక్కడం మినహా మరేం చేస్తాడు? ఏలికల దృష్టిలో పడి, ప్రభుత్వాల్లో కదలిక తీసుకురావడం కోసం తనకు తోచిన రీతిలో నిరసన తెలుపుతాడు. ఈ విషయంలో తమిళనాడుకు చెందిన రైతులు.. ఢిల్లీ వీధుల్లో చేసిన ‘విన్యాసాలు’ ప్రపంచం మొత్తాన్ని ఇటువైపు చూసేలా చేశాయి.

మన మోదీ వారి మొద్దు నిద్దరను మాత్రం వదిలించలేకపోయాయి. 30 వేల మంది మహారాష్ట్ర రైతులు 180 కిలోమీటర్ల కాలినడకతో చలో అసెంబ్లీ అంటూ ముంబైకి దారితీసినా అక్కడ ఫలితం మాత్రం గుండుసున్నా. కానీ.. నిరసన తెలపడమనే హక్కునైతే వదిలిపెట్టుకునేలా లేడు సగటు రైతు.

పాలసేకరణ ధరపై రాయితీ పెంచాలంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన బాట పట్టారు. లీటర్‌కు రూ.5 రాయితీ ఇవ్వాలన్నది వాళ్ళ డిమాండ్. కడుపు నింపని ఈ పాలు వృధా అంటూ మగల్వేదాకు చెందిన సాగర్ అనే రైతు.. ఏకంగా పాలతో స్నానం చేసి నిరసన తెలిపాడు.

35 లీటర్ల పాలతో నడిరోడ్డుపై అతడాడిన స్నానం సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయ్యింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మనసు మాత్రం కరిగేలా లేదు.

Related News