మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్

మల్టీప్లెక్స్‌లకు వెళ్లే సినీ ప్రేక్షకులకు గుడ్‌‌న్యూస్. అక్కడ స్టాల్స్ అమ్మే వస్తువుల అధిక ధరలకు కళ్లెం వేసేలా చర్యలు తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. మల్టీప్లెక్స్‌లోనే కొనాలన్న నిబంధనకు అడ్డుకట్ట వేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. మల్టీప్లెక్స్‌లకు వెళ్లేటప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ కూడా తీసుకొని వెళ్లొచ్చు. అంతేకాదు ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై చర్యలు తీసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై ఆరువారాల్లో విధివిధానాలు రూపొందించే పనిలోపడింది.

కొద్దినెలలుగా మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన ఈ వ్యవహారంపై ఓ మల్టీప్లెక్స్ యాజమాన్యంతో పోరాటానికి దిగిన విషయం తెల్సిందే! మరోవైపు బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో ఈ విషయంపై సమాధానం ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సర్కార్‌ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఈ ప్రకటన చేసింది.

READ ALSO

Related News