శ్రీవారి గజవాహన సేవ

కలియుగ దేవదేవుడు తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు భక్తిప్రపత్తులతో, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. వైకుంఠనాధుడు, అలివేలు మంగమ్మల నామస్మరణతో తిరుమల కొండ శోభిల్లుతోంది. దసర పండుగను పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు తరలివచ్చిన భక్తకోటి పారవశ్యంతో పరవశించిపోతున్నారు. రోజుకొకతీరుగా జరుగుతున్న శ్రీవారి సేవలు భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. ఇవాళ గజవాహన సేవ కన్నుల పండువగా జరుగుతోంది.

Related News