అమ్మమ్మని అయ్యాను- రాయ్‌లక్ష్మి

ఏదో విధంగా సోషల్‌మీడియాలో హంగామా చేస్తోంది రాయ్‌లక్ష్మి. తెలుగు, తమిళంలో మంచి ఇమేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు. తాజాగా తాను అమ్మమ్మని అయ్యానంటూ ఓ పోస్ట్ అప్‌లోడ్ చేసింది. రాయ్‌లక్ష్మి పెంపుడు కుక్కలు ఇటీవల రెండు కవలలకు జన్మనిచ్చాయి. వాటిని ఎత్తుకుని తాను అమ్మమ్మను అయ్యానంటూ మురిసిపోతోందామె. నా వయసు ఆడ పిల్లలు ఎవరైనా మహాఅయితే పెళ్లై అమ్మలవుతారు. కానీ, నేను మాత్రం అమ్మమ్మనయ్యాను.. గర్వంగా వుంది. నా ఇద్దరు ‘పిల్లలకు’ మరో ఇద్దరు పిల్లలు పుట్టినందుకు సంతోషంగా ఉంది.. మియు, లియు అనే పేర్లు కూడా పెట్టాను.. నా ప్రపంచం ఇప్పుడదే! మాది పెద్ద కుటుంబమంటూ రాసుకొచ్చింది రాయ్‌లక్ష్మి.

 

READ ALSO

Related News