పూటకో వేషం.. లేడీ డాన్ చిక్కింది

కొద్దిరోజులుగా ఖాకీలకు చిక్కకుండా తిరుగుతోంది లేడీ డాన్ భూరీ. ఆమె కదలికలను క్షుణ్ణంగా గమనించి, రౌండప్ చేసి అరెస్ట్ చేశారు సూరత్ పోలీసులు. బహిరంగంగా ఆయుధాలు పట్టుకుని బెదిరింపులకు పాల్పడడం ఆమె హాబీ. ఈ క్రమంలో పలు దొంగతనాలతోపాటు బెదిరింపులు, హత్యలు, దాడులు, అల్లర్లు వంటి ఘటనలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈమెపై వివిధ ప్రాంతాల్లో రకరకాల కేసులు నమోదయ్యాయి.

అందులో ఒకటి లేడీ‌ డాన్ బెదిరింపులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సూరత్‌లోని హేమకుంజ్ సొసైటీకి చెందిన మహేష్ కాలూ కజారియా కొడుకు చిరాగ్ బైక్‌పై బయటకు వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక, భూరీ.. తన అనుచరునితో వచ్చి కత్తితో చిరాగ్‌ను బెదిరించి బైక్‌తో పరారైంది. అప్పటినుంచి ఈమెపై ఫోకస్ చేసిన పోలీసులు, పక్కాగా స్కెచ్ వేసి అరెస్ట్ చేశారు.

 

Related News