‘రెండున్నర కోట్ల కథ’లో.. కేటీఆర్ హీరో, విలన్..?

తెరాస యువరాజు కేటీఆర్.. రెండు రకాల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆన్లైన్.. ఆఫ్‌లైన్..! బహిరంగ సభలు, ప్రెస్‌మీట్ల ద్వారా దులిపే దుమ్ము ఒకటి.. సోషల్ మీడియా ద్వారా జరిగే ఎటాకింగ్ స్టైల్ మరొకటి. ఇప్పటికే నెటిజన్లకు బాగా దగ్గరైన కేటీఆర్.. ఆ మార్గాన్ని విరివిగా ఉపయోగించుకునే పనిలో పడ్డారు. కేసీఆర్ ఆలా శంఖారావం పూరించారో లేదో.. కేటీఆర్ ఇలా ప్రతిపక్షాల మీద మిస్సైల్స్ దాడి షురూ చేశారు. తాజాగా.. ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వేసిన ‘బాంబ్’ మామూలుగా పేలలేదు.

”నేను రాజకీయాల్లో వున్నప్పుడు కేటీఆర్ అమెరికాలో గిన్నెలు కడుక్కునేవాడు. ఇప్పుడొచ్చి మాకు రాజకీయాలు నేర్పుతున్నాడు..” అంటూ ఉత్తమ్ చేసిన కామెంట్‌కి కేటీఆర్ దీటైన కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ స్టేట్మెంట్స్‌కి సంబంధించిన పేపర్ కట్టింగ్‌ని పోస్ట్ చేస్తూ.. అయన మరో ఫ్లాష్‌బ్యాక్‌ని రీకాల్ చేశారు. ‘అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కోవడం, సొంతంగా డబ్బులు సంపాదించుకోవడం సహజం. అది గొప్ప విషయం కూడా. నేను మీలాగా ప్రజల డబ్బుని కారులో తగలబెట్టుకోలేదు” అన్నది కేటీఆర్ ఇచ్చిన కౌంటర్. 2014 ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు ఉత్తమ్ కుమార్ కారులో తగలబడ్డ రెండున్నర కోట్ల కరెన్సీ.. వాటిని ఎలక్షన్ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటి న్యూస్ ఐటెంని కూడా ట్యాగ్ చేశారు. ప్రతిపక్ష నాయకుల నోళ్లకు తాళం వెయ్యడానికి.. కేటీఆర్ ఎంచుకున్న లేటెస్ట్ రూట్ ఇదే మరి?

Related News