నాటి ఉద్యమం.. నా ఫోటోలు చూస్తారా ?

2014 లో తాను నేరుగా మంత్రినయ్యానని, తెలంగాణా ఉద్యమంలో పాల్గొనలేదని కొందరు స్కాంగ్రెస్ వారు అంటున్నారని, అయితే 2006 నుంచి 2014 వరకు సుమారు 8 సంవత్సరాల పాటు ఆ నాటి ఉద్యమంలో తను పాల్గొన్నానని తెలంగాణా మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ నేను కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను. నిరసనల వేళ.. పోలీసు అడ్డుకట్టలను దాటేందుకు ఎవరు ప్రయత్నించారో మీరే చూడండి ‘ అంటూ కొన్ని ఫోటోలను తన ట్విటర్ లో ఆయన పోస్ట్ చేశారు. ఇనుప కంచెలను దాటడానికి కేటీఆర్ యత్నిస్తున్న చిత్రాలు, రోడ్డుపై బైఠాయింపు, పోలీసుల అరెస్ట్ సందర్భంగా కిందపడిపోయిన ఫోటోలు వీటిలో ఉన్నాయి.

Related News