లోకేష్.. కేటీఆర్ హ్యాపీస్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభ వాణిజ్యం) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఈ ర్యాంకుల కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వెంట్రుకవాసి తేడాతో బలంగా పోటీపడ్డాయని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ప్రశంసించడం విశేషం. అయితే, సంస్కరణల్లో తెలంగాణ నూటికి నూరు శాతం మార్కులు సాధించింది. ఇదేకోవలో ఝార్ఖండ్‌కు 100% మార్కులు దక్కాయి. 2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం ఈ ర్యాంకులు ప్రకటించింది.

సులభవాణిజ్య విభాగంలో గత ఏడాది తెలంగాణతో కలిసి మొదటి ర్యాంకు పంచుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఈసారి 98.42% మార్కులతో ఒంటరిగానే ఆ స్థానంలో నిలిచింది. 98.33% మార్కులతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొంది. హరియాణా, ఝార్ఖండ్‌, గుజరాత్‌లు వరుసగా 3, 4, 5 ర్యాంకులు పొందాయి. ఈసారి ఈ ర్యాంకులను ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో కాకుండా ‘స్టేట్‌ బిజినెస్‌ రిఫామ్స్‌ అసెస్‌మెంట్‌’ పేరుతో ప్రకటించారు. ర్యాంకుల పట్ల తెలుగు రాష్ట్రాల మంత్రులు, నారాలోకేష్, కేటీఆర్ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇరువురూ దీనికి సంబంధించి పరస్పర ఆసక్తికర ట్వీట్లు చేశారు.

Related News