అల్టిమేటం ఇచ్చాం..జవాబు లేదు

టీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన కొండా సురేఖ, కొండా మురళి మరో వ్యూహంపై దృష్టి సారించారు. వరంగల్‌లో తమ మద్దతుదారులతో సమావేశమైన వీరు.. అధైర్యపడాల్సిన అవసరంలేదని, ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను కేటాయించకపోవడంపై బహిరంగ లేఖ రూపంలో నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కొండా సురేఖకు టికెట్ ఎందుకు నిరాకరించారో చెప్పాలని నేరుగా కేసీఆర్‌కే అల్టిమేటం వంటిది ఇచ్చామని, అయితే 24 గంటలు గడిచినా దానికి సమాధానం లేదని కొండా మురళి అన్నారు. తమ బహిరంగ లేఖలో అన్ని విషయాలూ ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యకర్తల అభిమతం మేరకు ఈ నెల 23 తరువాత ఏ పార్టీలోకి వెళ్ళాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా-ఈ నెల 12 నవీరు, టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, డీఎస్… కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

READ ALSO

Related News