12న ముహూర్తం.. కాంగ్రెస్‌లోకి నలుగురు బిగ్ షాట్స్!!

మాజీలకు కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ పరిచేందుకు రెడీ అయింది. వీళ్ళంతా పొలోమని మళ్ళీ ఆ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ రాక భంగ పడిన కొండా  సురేఖ, ఆమె భర్త మురళి రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వాస్తవ రూపం  దాలుస్తున్నాయి. ఈ నెల 12 న పార్టీ సీనియర్ నేత గులాం  నబీ ఆజాద్ సమక్షంలో ఈ దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైనప్పటికీ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉన్న డీఎస్ పేరు కూడా వీరితో బాటే వినిపిస్తోంది. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మరికొందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related News