మోదీ-కుమార మధ్య కోహ్లీ ఛాలెంజ్‌ చిచ్చు.!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రధాని నరేంద్రమోదీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు.. ఆ సవాలుని స్వీకరించిన మోదీ తాను చేస్తున్న వర్కౌట్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఉదయం వేళ యోగా చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని కూడా మోడీ వ్యాఖ్యానించారు. రోజూ ఇలా చేయడం ద్వారా రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించి ప్రాణాయామం చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందంటూ.. కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని మోడీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరారు. మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు కుమారస్వామి స్పందించారు. తాను చాలా ఫిట్‌గా ఉన్నానని.. రోజూ యోగా, ట్రెడ్ మిల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. తమ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించే తన ఆందోళన అని.. తమ రాష్ట్రానికి మీ సాయం కోరుతున్నట్లు ప్రధానికి సోషల్ మీడియాతో ద్వారా విన్నవించి పనిలోపనిగా స్వకార్యం పూర్తి చేసుకున్నారు కుమారస్వామి.

Related News