కొచ్చి ఎయిర్‌పోర్టు నష్టం 220 కోట్లు, 26 నుంచి..

కేరళలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సహాయక చర్యలు వేగ వంతమవుతున్నాయి. వరదల కారణంగా నష్టపోయిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు సిద్ధమైయ్యారు అధికారులు. భారీ వర్షాలతో 12 రోజులుగా మూసివేసిన కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని ఈనెల 26న (ఆదివారం) తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది ఎయిర్‌పోర్టు అథారిటీ.

పెరియార్ నది గేట్లు ఓపెన్ చేయడంతో వరద నీరు ఎయిర్‌పోర్టులోకి వచ్చేసింది, దీంతో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు సముద్రాన్ని తలపించాయి. కొద్దిరోజుల ముందు ఇక్కడ ఎయిర్‌పోర్టులో 60 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్‌ని ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారి సోలార్ పవర్‌తో నడుస్తున్న ఎయిర్‌పోర్టు ఇది. వరదల ధాటికి ఈ పవర్ ప్లాంట్ ధ్వంసమైంది. ఈ వరదల వల్ల విమానాశ్రయానికి దాదాపుగా 220 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నమాట.

వరదలకు రెండున్నర కిలోమీటర్ల మేరా గోడ కూలిపోయింది. రన్ వే, ట్యాక్సీ బే, షాపులు, రన్ వే లైట్స్, దేశీయ, అంతర్జాతీయ టెర్మినల్స్ డ్యామేజ్ అయ్యాయి. వీటిని మళ్లీ నిర్మించాల్సివుంది. ఓవరాల్‌గా 220 కోట్లు నష్టం వాటిల్లిందని అంటున్నారు.

Related News