కేరళకు దయచేసి పంపొద్దు.!

 

కేరళ వరదబాధితులకు సాయం ఆపండి మొర్రో అని మొత్తుకోవడం తాజా విన్నపమైంది. బట్టలు, వంటదినుసులు, తినుబండారాలు కావల్సినన్ని ఉన్నాయని కేరళలోని ఇండోర్ స్టేడియంలలో ఇవి పేరుకుపోయాయని.. తమకు కావాల్సినవి అవి కాదని కేరళ వాసులు అంటోన్న మాట. తాజాగా కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ కూడా ఇదే మాట చెప్పారు. వరదల కారణంగా విధ్వంసమైన కేరళను చక్కదిద్దేందుకు ఇప్పుడు వేలాదిమంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వెహికల్ మెకానిక్స్, తాపీ మేస్త్రిలు.. వంటి నిఫుణుల సాయం అవసరమన్నారు. దుస్తులు, ఆహారం తమకు అవసరం లేదని, సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు వచ్చి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. కేంద్ర బలగాలు అద్భుతమైన సాయం చేస్తున్నాయని.. శిబిరాల్లో తలదాచుకుంటున్న లక్షలాదిమంది నిరాశ్రయులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా జిల్లా కలెక్టర్లు కో- ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేరళకు చెందిన ఒక వ్యక్తి చేసిన సుదీర్ఘ వివరణాత్మక విన్నపం ఈ ఆడియోలో వినవచ్చు.

 

Related News