తెరాస మేనిఫెస్టో లీకైందా!?

ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు పెంచిన టీఆర్ఎస్.. అంతే వేగంగా మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆదివారంలోగా టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలయ్యే ఛాన్సుంది. శనివారం తెలంగాణ భవన్లో మేనిఫెస్టో కమిటీ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె. కేశవరావుతో పాటు 15 మంది సభ్యులు పాల్గొంటారు. 2014లో ఇచ్చిన హామీలతో పాటు ఇప్పుడు కొత్తగా రూపొందించాల్సిన అంశాలపై చర్చ చేపట్టనున్నారు. ఈ సమావేశంలో మేనిఫెస్టోకు తుది రూపు రానుంది. నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి లాంటి జనరంజక హామీలతో కాంగ్రెస్ పార్టీ చెలరేగిపోయిన నేపథ్యంలో.. గులాబీ బాస్ ‘అంతకు మించి’ ఏమిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తెరాస మేనిఫెస్టోలోని కీలక అంశాలు అంటూ కొన్ని హామీలు ఇప్పటికే సోషల్ మీడియాలో తిరిగేస్తున్నాయి.

Related News