ఫ్యాన్స్ హేళన, కత్రినాకు కోపం తన్నుకొచ్చింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రికా కైఫ్ ఒకరు. అమెరికా, కెనడా టూర్లలోవున్న ఆమెకి ఊహించని విధంగా చేదు అనుభవం ఎదురైంది. సల్మాన్‌‌తో కలిసి ‘దబాంగ్ రీలోడెడ్’ టూర్‌లోవున్న ఆమె, వాంకూవర్‌లో ఓ షో చేసిన తర్వాత బయటకువచ్చింది. అదే సమయంలో తామేమీ నీతో ఫొటో దిగమంటూ కత్రినాను ఓ మహిళా అభిమాని హేళన చేసినట్టు మాట్లాడింది. దీంతో కత్రినాకు చిర్రెత్తుకొచ్చింది.. ఇక అంతే సహనం కోల్పోయిన ఈ సుందరి.. వాళ్లతో వాగ్వాదానికి దిగింది.

మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదని, తానిప్పుడే షో చేసి అలసి పోయానని చెప్పుకొచ్చింది. దీనికి ఆ అభిమాని గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఫ్యాన్స్‌తో మీరు ఇలా వ్యవహరించడం బాగా లేదని, మీ తీరు మార్చుకోవాలని ఆ అభిమాని, హీరోయిన్‌కి సలహా ఇచ్చేసింది. అవేమీ పట్టించుకోకుండా కత్రినా.. అభిమానితో సెల్ఫీ దిగుతూ కనిపించింది. తాము మీ కోసం రాలేదని, సల్మాన్ కోసం వచ్చామంటూ మరికొందరు కౌంటర్ ఇచ్చారు. ఈ హంగామాకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

READ ALSO

Related News