ముక్కు, చెవులు కోసేస్తాం!

రాజస్థాన్లో ఎన్నికల వేడి షురూ అయింది. అసెంబ్లీ గడువు ముగుస్తున్న తరుణంలో.. అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చేశాయి. ముఖ్యంగా ఎదురుగాలి వీస్తున్న బీజేపీ అయితే కసెక్కిపోతోంది. ఈ క్రమంలోనే.. విద్యామంత్రి కిరణ్ మహేశ్వరి కాస్త నోరు జారేసింది. ”అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందుకే.. కలుగుల్లోంచి ఎలుకలన్నీ ఒక్కటొక్కటిగా బైటికొస్తున్నాయి..” అంటూ రాజ్‌ఫుత్‌ల మీద కామెంట్ చేసింది. వెంటనే నోరు చేసుకున్న కర్ణిసేన.. రాజ్‌పుత్‌లను ఎలుకలతో పోల్చిన మంత్రి మహేశ్వరి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. తామిచ్చిన గడువులోగా ఆమె మెట్టు దిగి రాకపోతే.. ముక్కు, చెవులు కోస్తామంటూ కర్ణిసేన రాజస్థాన్ చీఫ్ మహిపాల్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో.. ఇప్పుడు రాజస్థాన్ బీజేపీ సర్కిల్స్ గుండెల్లో మారుమోగుతోంది. ‘పద్మావతి’ సినిమా వివాదంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణిసేన.. ఇలా మళ్ళీ వార్తల్లోకొచ్చింది. పద్మావతి పాత్రలో నటించిన దీపికా తల నరికి తెస్తే కోటి రూపాయల నజరానా ఇస్తామంటూ కర్ణిసేన వేసిన దండోరా గుర్తుండే ఉంటుంది.

Related News