వెరైటీ.. శ్మశానంలో మ్యారేజ్ వేడుకలు

మ్యారేజ్ వేడుకలంటే బంధువులు, ఫ్రెండ్స్‌‌లను పిలిచి ఇంట్లో ఘనంగా జరుపుకోవడం చూస్తూనేవుంటాం. కానీ, కర్ణాటకలో ఓ జంట శ్మశానంలో వేడుకలను నిర్వహించింది. ఈ వ్యవహారం కలబుర్గి శివార్లలో జరిగింది. నందికూరుకు చెందిన అనిత- పవన్‌కుమార్ అనే దంపతులు తమ 18వ మ్యారేజ్ డే సందర్భంగా శ్మశానాన్ని శుభ్రం చేశారు.

దీనికి జడ్పీ వైస్ చైర్మన్ అనిత, ఓ మహిళా సామాజిక కార్యకర్త తన భర్తతో కలిసి శ్మశానానికి వచ్చారు. అక్కడ చెత్తాచెదారం తొలగించి మొక్కలను నాటారు. శ్మశానంలోనే బంధువులు, గ్రామస్థుల సమక్షంలో అనిత- పవన్‌లు దండలు మార్చుకున్నారు. శ్మశానంలో దెయ్యాలు, భూతాలు వుంటాయని.. ఇవన్నీ మూఢనమ్మకాలేనని చెప్పడం కోసం ఇలా తమ పెళ్లి రోజుని జరుపుకుంది ఈ జంట.

READ ALSO

Related News