రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం

కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బాగల్ కోట్ వద్ద ట్రక్కును తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో న్యామగౌడ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన జమాఖండి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

 

Related News