గత ఎన్నికల్లో ఇద్దరు దొంగలు పోటీ చేస్తే..

గత ఎన్నికల్లో ఇద్దరు దొంగలు పోటీ చేస్తే, వారిలో చంద్రబాబు బెటర్ దొంగగా ప్రజలు ఎన్నుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపిన ఘటనలో ధర్మాబాద్ కోర్టు వారంట్ జారీ చేసిన విషయంలో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారని.. చంద్రబాబుకు జ్వరమొచ్చినా మోదీ కుట్రే అంటున్నారని కన్నా ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాల ప్రచారం కోసం జియో గ్రాఫిక్ ఛానల్‌కు నాడు రూ.64 లక్షలు ఇచ్చారని, అందుకే, వీఐపీ ఘాట్ ఉండగా సాధారణ యాత్రికుల ఘాట్‌కు చంద్రబాబు వెళ్లారని కన్నా చెప్పుకొచ్చారు. ఒక టెలీ ఫిల్మ్ కోసం 29 మందిని పొట్టనపెట్టుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన మీడియా అతివల్ల జరిగిందని కమిటీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కన్నా విమర్శించారు.

Related News