రెండోసారి అదే తప్పుచేశాడు!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు మరోసారి బుక్కైపోయాడు. ఆయన నటిస్తున్న మ‌హ‌ర్షి సినిమా అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. ఐతే, విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా గురువారం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లోని త‌న అభిమానుల‌కు విషెస్ చెప్పాడు మహేష్‌బాబు. ఐదు భాష‌ల‌లో విషెస్ చెప్పిన ప్రిన్స్, కన్నడ అభిమానుల‌ను విష్ చేయ‌డం మ‌ర‌చిపోయాడు. దీంతో మ‌హేష్‌ని వాళ్లు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

పరిస్థితి గమనించిన ప్రిన్స్.. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో క‌న్నడ‌లోనూ ద‌స‌రా శుభాకాంక్షలు తెలిపాడు. గ‌తంలోనూ ఇలాంటి అనుభ‌వం మ‌హేష్‌కి కన్నడ అభిమానుల నుంచే ఎదురైంది. భ‌ర‌త్ సినిమా విజ‌యం సాధించ‌డంతో ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన అభిమానుల‌కు కృత‌జ్ఞత‌లు ఇంటూ తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేసి కన్నడ అభిమాలను మరిచి పోయాడు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మ‌హేష్ త‌న ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా క‌న్నడిగుల‌కి వారి భాష‌లో ధ‌న్యవాదాలు తెలపడంతో కూల్ అయ్యారు.

 

Related News