కాలు జారిన కాజోల్

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‌కి ఊహించని ఘటన ఇది. గురువారం ముంబైలోని ఓ షాపింగ్‌మాల్‌కి వెళ్లిన ఆమె, నడుస్తూ కాలు జారి కింద పడిపోయింది. ఒక సెక్యూరిటీ సాయంతో తిరిగి లేచింది. ఈ ఘటనలో ఆమెకి ఎలాంటి గాయాలు కాలేదు. ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌లో హెల్త్ అండ్ గ్లో స్టోర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఎస్కలేటర్ దిగి ఫ్లోర్‌ మీద నడుస్తున్న సమయంలో మరొక మహిళతో మాట్లాడుతూ వెనక్కి పడిపోయింది కాజోల్.

ఈ సన్నివేశాన్ని ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మూడేళ్ల కిందట కూడా ‘దిల్ వాలే’ ఫిల్మ్ ట్రైలర్ విడుదల సమయంలో కాజోల్ కాలు జారిపడిపోతున్న క్రమంలో కో-నటుడు వరుణ్ ధావన్.. ఆమెరెండు చేతులతో పట్టుకుని కాపాడిన విషయం తెల్సిందే!

Related News