తేడా వస్తే ఓటు కాదు.. వేటు వేస్తాం..!

తమిళ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కాలా’ ఫీవర్ ఇంకా పూర్తిగా చల్లారలేదు. వండర్‌బార్ స్టూడియోస్ బేనర్ మీద ‘అల్లుడు’ ధనుష్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ‘కాలా’ మూవీకి మొదట్లో పేలవమైన టాక్ నడిచింది. ఆ తర్వాత ఒక మోస్తరుగా వసూళ్లు పుంజుకున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. రజనీ స్టైలిష్ యాక్షన్‌తో పాటు.. పా రంజిత్ న్యాచురల్ డైరెక్షనల్ టాలెంట్.. సినిమాను ఇంకా లైవ్లీగా ఉంచేసింది. ఇదిలా ఉంటే.. సినిమాలో ‘యమ గ్రేటు’ అంటూ హీరోను ఎలివేట్ చేస్తూ సాగే టైటిల్ సాంగ్ తెలుగు వెర్షన్‌ని యూనిట్ విడుదల చేసింది. గల్లీ పాలిటిక్స్ నేపథ్యంతో సాగిన ఈ పాటను.. ముంబై ధారవి మురికివాడ కేంద్రంగా  తీశారు. కాలా అడ్డాగా పేరున్న ఆ మురికివాడలో పరాయి పొలిటిషియన్లు చొరబడితే.. వేటు వేస్తామంటూ హెచ్చరిస్తూ పూర్తి మాస్ లిరిక్స్ తో నడుస్తుందీ పాట!

Related News