తెలుగులో ‘కాలా’హలం.. రజనీకాంత్ ఆదుకుంటాడా?

అవును.. రజనీకాంత్ ప్రిస్టీజియస్ మూవీ ‘కాలా’ తెలుగులో వర్కవుట్ కాలేదు. తమిళనాట కూసింత పాజిటివ్ టాక్ నడవడంతో.. ఓవరాల్ వసూళ్లు వందకోట్లకు చేరినట్లు లెక్కలు తేల్చారు నిర్మాతలు. కర్ణాటకలో పాక్షిక నిషేధం కారణంగా ఓపెనింగ్స్ ఎలాగూ లేవు. అటు.. హిందీలో సైతం రజనీ మానియా పని చేసిన దాఖలా లేదు. ముంబై ధారవి మురికివాడ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో.. ముంబై సర్కిల్స్‌లో సినిమా ఆడుతుందని ఆశించినప్పటికీ.. ఆ ఫార్ములా సైతం తిరగబడింది. ఇక తెలుగు..! ఇక్కడ కూడా కాలా ప్రొడ్యూసర్‌కి చేదు అనుభవమే మిగిలింది. డబ్బింగ్ హక్కుల కోసం దాదాపు రూ. 30 కోట్లు ఖర్చుపెట్టిన ఎన్.వి. ప్రసాద్.. ఆ మేరకు వసూళ్లు దక్కుతాయన్న ఆశల్ని వదిలేసుకున్నారు. మొదటి ఐదు రోజుల్లో కాలా మూవీ సాధించిన వసూళ్లు ఏడు కోట్లు మాత్రమేనంటూ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. లాంగ్ రన్‌లో అయినా మరిన్ని పైసలొస్తాయనుకోడానికీ లేదు. ఎందుకంటే.. సినిమా టాక్ సాలిడ్‌గా లేదు. ఇప్పటికే బీ, సీ సెంటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతంలో.. బాబా మూవీని కొన్నప్పుడు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు ఎన్వీ ప్రసాద్. కానీ.. రజనీకాంత్ పెద్ద మనసు చేసుకుని.. ఆ నష్టాన్ని వడ్డీతో సహా పూడ్చి మంచోడనిపించుకున్నాడు. ఇప్పుడీ ‘కాలా’హలం విషయంలో సూపర్‌స్టార్ ఎలా స్పందిస్తారో మరి!

Related News