స్వాప్నికుడో – కారులో కవాతుచేసే సినిమా హీరోనో..

‘కొన్ని వేల మంది అబ్దుల్ కలాంలను తయారు చేయాలన్న స్వాప్నికుడు’ చంద్రబాబు ఒకవైపు.. ‘కారులో ఎక్కి కవాతు చేసే ఒక సినిమా హీరో’ మరోవైపు. వీరిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు. ముఖ్యమంత్రి కావాలనే కలలు పవన్ కల్యాణ్ కంటూనే ఉండాలని ఎద్దేవా చేశారు. ‘మోదీ గారి డైరెక్షన్ లో ఓ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడట! అవండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబుని, లోకేశ్ ని విమర్శిస్తూ మీరు ఎలా అవుతారో..! ప్రజలు కచ్చితంగా సమాధానం చెబుతారు’ అని జూపూడి అన్నారు.

జనసేన’ పోటీ చేసే స్థానాల్లో దక్కేవి డిపాజిట్లే తప్ప గెలుపు కాదన్నారు. ఆ పార్టీ ఒక కులానికి చెందిన పార్టీ అని.. ఆ పార్టీలో సామాజిక న్యాయం లేదని జూపూడి విమర్శించారు. ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అన్నయ్య చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన విమర్శలను తిప్పికొట్టిన జూపూడి, తాను ముఖ్యమంత్రి కావాలని లోకేశ్ ఏనాడూ అనలేదని చెప్పుకొచ్చారు.

Related News