సాయేషాతో పోటీపడిన మడోన్నా సెబాస్టియన్

వెరైటీ స్టోరీలకు ప్రయారిటీ ఇచ్చే విజయ్‌సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ జుంగా. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ని విడుదల చేసింది యూనిట్. డిఫరెంట్ లుక్‌తో విజయ్ సేతుపతి కొత్తగా కనిపించాడు. ఇక గ్లామర్ విషయంలో సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్‌లు పోటీపడి మరీ నటించారు. ఫారిన్ లొకేషన్స్, భారీ ఛేజింగ్స్ ట్రైలర్‌లో మరో హైలైట్. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి డైరెక్టర్ గోకుల్.

ఈ మూవీ హిట్టయితే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది సాయేషా. టాలీవుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ర్టీకి పరిచయమైంది సాయేషా. అఖిల్ తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రాలేకపోవడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

Related News