సీఎం రమేష్‌పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా, స్టీల్ ఫ్యాక్టరీ కోసం కడపలో దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేం కొప్పులో పువ్వులు పెట్టుకున్నామా అంటూ రమేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీక్ష చేస్తే స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని కలగంటున్నావా.. ఉక్కురాదు.. తుక్కు రాదంటూ తన దైన శైలిలో బహిరంగ ప్రకటనలు చేశారు. దీక్షేమానుకోమని సలహా ఇచ్చారు. కడపలో ఎంపీ సీఎం రమేష్‌ దీక్షా స్థలికి విచ్చేసిన జేసీ అనేక విసుర్లు విసిరారు. ఈ దీక్షలవల్ల స్టీల్‌ప్లాంట్‌ రాదు.. ఈ పెద్ద మనిషి పిచ్చిపట్టి దీక్ష చేస్తున్నాడన్నారు. మందులతో సాగుచేసిన తిండితింటున్నవారిలో నిజాయితీ ఎలా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఉండటం మన ఖర్మ.. ఏపీకి మోదీ ఏమీ చేయడని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానన్నారు. సీఎం చంద్రబాబు తక్కువోడేమీకాదని, నాటకాలు, డ్రామాలు, కుయుక్తులు చంద్రబాబుకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎత్తులు తెలిసే ఏపీకి మోదీ ఏమీ చేయడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ మావాడు.. నన్ను ఎందుకు తీసుకోలేదు.. నేను ఎందుకు వెళ్లలేదు? జగన్‌కు దురహంకారం ఎక్కువ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేసేలా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది.

READ ALSO

Related News